జిల్లా అభివృద్ధి టీడీపీకే సాధ్యం: ఎమ్మెల్యే దామచర్ల

జిల్లా అభివృద్ధి టీడీపీకే సాధ్యం: ఎమ్మెల్యే దామచర్ల

ప్రకాశం: చీమకుర్తి మండలం రామతీర్థంలో టీడీపీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ప్రభలను సంతనూతలపాడు ఎమ్మెల్యే బీఎన్ విజయ్ కుమార్‌తో కలిసి ఒంగోలు ఎమ్మెల్యే దామచర్ల జనార్ధన్ సందర్శించారు. టీడీపీ కార్యకర్తలను ఉత్సాహపరిచారు. ఉమ్మడి ప్రకాశం జిల్లాను అభివృద్ధి చేసే సత్తా టీడీపీకే ఉందన్నారు. కష్టపడి పనిచేసిన ప్రతీ కార్యకర్తకు పార్టీలో తగిన గుర్తింపు ఉంటుందని అన్నారు.