బాసర సరస్వతి అమ్మవారి హుండీ లెక్కింపు

బాసర సరస్వతి అమ్మవారి హుండీ లెక్కింపు

NRML: బాసర సరస్వతి అమ్మవారి హుండీ కానుకలను ఆలయ అధికారులు మంగళవారం లెక్కింపు చేపట్టారు. రూ.1,00,30,657 నగదు, మిశ్రమ బంగారం 143 గ్రాములు, మిశ్రమ వెండి 4 కిలోల, 250 గ్రాములతో పాటు వివిధ దేశాలకు చెందిన కరెన్సీలు 147 వచ్చినట్లు ఆలయ అధికారులు తెలిపారు. ఈ ఆదాయం మొత్తం దేవస్థానానికి 89 రోజులలో సమకూరినట్లు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఆలయ అధికారులు, సిబ్బంది ఉన్నారు.