డీజీపీని కలిసిన విజయవాడ సీపీ

కృష్ణా: విజయవాడ పోలీస్ కమిషనర్ రాజశేఖర్ బాబు మంగళగిరిలో డీజీపీ కార్యాలయంలో శనివారం డీజీపీ హరీశ్ కుమార్ గుప్తాను మర్యాదపూర్వకంగా కలిశారు. అనంతరం డీజీపీకీ పుష్పగుచ్ఛం అందించి అభినందనలు తెలిపారు. ఈ కార్యక్రమంలో డీసీపీ సరిత, తిరుమలేశ్వర్ రెడ్డి, మహేశ్వరరాజు, తదితరులు పాల్గొన్నారు.