నేడు విద్యుత్ సరఫరాలో అంతరాయం

నేడు విద్యుత్ సరఫరాలో అంతరాయం

BDK: నేడు అశ్వారావుపేట, దమ్మపేట మండలాల పరిధిలో విద్యుత్ సరఫరాలో అంతరాయం ఉంటుందని విద్యుత్ శాఖ అధికారులు తెలిపారు. అశ్వారావుపేట 132/33 కేవీ  సబ్ స్టేషన్‌లో ఎమర్జెన్సీ మరమ్మతుల కారణంగా ఉదయం 9:00 గంటల నుంచి మధ్యాహ్నం 1:00 గంట వరకు విద్యుత్ నిలిచిపోతుందన్నారు. 33కేవీ అశ్వారావుపేట, దమ్మపేట, వినాయకపురం, నారంవారిగూడెంలో కరెంట్ ఉండదన్నారు.