VIDEO: రేపటి నుంచి బోగత జలపాతం సందర్శన నిలిపివేత

ములుగు జిల్లా వాజేడు బోగత జలపాతానికి పర్యాటకుల సందర్శన ఆదివారం నుంచి నిలిపివేస్తున్నట్లు శనివారం అటవీ శాఖ అధికారులు తెలిపారు. గతరెండు రోజులుగా ఎడతెరిపి లేకుండా కురిసిన భారీ వర్షాలకు జలపాతం ప్రమాద స్థాయి దాటి ప్రవహిస్తున్నందున ఈనిర్ణయం తీసుకున్నారు. రానున్న రెండు రోజుల్లోనూ భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణశాఖ హెచ్చరించడంతో ఈచర్యలు చేపట్టారు.