హౌసింగ్ లేఅవుట్‌ను పరిశీలించిన కలెక్టర్
KRNL: గూడూరు మం. నాగలాపురం గ్రామంలో హౌసింగ్ లేఔట్‌ను జిల్లా కలెక్టర్ పి. రంజిత్ బాషా ఇవాళ పరిశీలించారు. మండల తహసీల్దార్ వెంకటేష్ నాయక్‌తో కలసి ఇళ్ల నిర్మాణాలను పరిశీలించారు. అనంతరం నిర్మాణం పూర్తయిన లబ్ధిదారులతో మాట్లాడి పలు విషయాలను పంచుకున్నారు. లబ్ధిదారులకు వీలైనంత త్వరగా నిర్మాణానికి కావలసిన ఇసుక, స్టీల్ వంటివి అందుబాటులొ ఉంచాలని సూచించారు.