శివరాత్రికి ప్రత్యేక బస్సులు సిద్ధం!
SRPT: మహాశివరాత్రి పర్వదినం సందర్భంగా భక్తుల కోసం సూర్యాపేట డిపో ప్రత్యేక బస్సులు ప్రకటించింది. ఈ నెల 14, 15 తేదీల్లో శ్రీశైలం, కోటప్పకొండ క్షేత్రాలకు సర్వీసులు నడపనున్నట్లు డీఎం సునీత తెలిపారు. 14న మధ్యాహ్నం 12 గంటలకు, 15న ఉదయం 5 గంటలకు బస్సులు బయలుదేరుతాయన్నారు. భక్తులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని డిపో మేనేజర్ సునీత కోరారు.