అటవీ శాఖ ప్రిన్సిపల్ చీఫ్ కన్సర్వేటర్ సందర్శన
PDPL: తెలంగాణ రాష్ట్ర అటవీ శాఖ ప్రిన్సిపల్ చీఫ్ కన్సర్వేటర్ డాక్టర్ సువర్ణ, ఐఎఫ్ఎస్ శనివారం రామగుండం-3 ఏరియాలో పర్యటించారు. రామగిరి అతిథి గృహంలో ఏరియా జనరల్ మేనేజర్ సుధాకరరావు ఆమెకు స్వాగతం పలికారు. అనంతరం ఓసీపీ-2 ఉపరితల గనిని సందర్శించి, మొక్కను నాటారు. సింగరేణి సంస్థ అభివృద్ధికి అవసరమైన అటవీశాఖ భూముల విషయంలో సహకారం అందించాలని జీఎం కోరారు.