రోడ్డు ప్రమాదంలో వ్యక్తికి గాయాలు
KDP: పులివెందుల పట్టణంలోని స్థానిక పార్నపల్లి రోడ్డు సమీపంలో ఉన్న రింగురోడ్డులో శనివారం బైకును టిప్పర్ ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో వ్యక్తికి తీవ్ర గాయాలయ్యాయి. ఈ విషయం తెలుసుకున్న స్థానికులు వెంటనే గాయపడిన వారిని 108 వాహనంలో పులివెందుల ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని ప్రమాద వివరాలను అడిగి తెలుసుకుంటున్నారు.