VIDEO: కేంద్ర ప్రభుత్వ దిష్టిబొమ్మను దగ్ధం చేసిన సీపీఎం

MHBD: పెంచిన పెట్రోల్, గ్యాస్, డీజిల్ ధరలను వెంటనే తగ్గించాలని డిమాండ్ చేస్తూ సీపీఎం పార్టీ కార్యకర్తలు నేడు జిల్లా కేంద్రంలో ఆందోళన నిర్వహించారు. సీపీఎం పార్టీ మాజీ ఫ్లోర్ లీడర్ అజయ్ సారధి రెడ్డి ఆధ్వర్యంలో కార్యకర్తలు పురవీధుల్లో భారీ ర్యాలీ నిర్వహించి నిరసన తెలిపారు. అనంతరం కేంద్ర ప్రభుత్వ దిష్టిబొమ్మను దగ్ధం చేశారు.