నర్సంపేటలో నేడు పవర్ కట్
WGL: నర్సంపేట పట్టణంలో ఇవాళ ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు విద్యుత్ సరఫరా నిలిపివేయనున్నట్లు అధికారులు తెలిపారు. 33/11 కేవీ టవర్‌లైన్ మరమ్మతుల కారణంగా బస్టాండ్ నుంచి వరంగల్ రోడ్ అయ్యప్పస్వామి దేవాలయం వరకు విద్యుత్ అంతరాయం ఉంటుందని చెప్పారు. వినియోగదారులు సహకరించాలని కోరారు.