టీకాల కార్యక్రమాన్ని పరిశీలించిన హెచ్ఈవో

కామారెడ్డి పట్టణంలోని UPHC ఇస్లాంపురలోని అంగన్వాడిలో వ్యాధి నిరోధక టీకల కార్యక్రమాన్ని హెల్త్ ఎడ్యుకేషన్ ఆఫీసర్ రవీందర్ నేడు పరిశీలించారు. చిన్నపిల్లలు క్రమం తప్పకుండా వ్యాధి నిరోధక టీకాలు అందించాలని సిబ్బందిని సూచించారు. అలాగే ఇచ్చిన టీకాలు ఇచ్చిన వెంటనే ఆన్‌లైన్‌లో నమోదు చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో ఏఎన్ఎం, ఆశ వర్కర్లు , వైద్య సిబ్బంది పాల్గొన్నారు.