పుంగనూరులో నేడు తిరంగా యాత్ర

CTR: పుంగనూరులో ఆదివారం తిరంగా యాత్ర నిర్వహించనున్నట్లు పలు సంఘాల నాయకులు తెలిపారు. శనివారం సాయంత్రం పుంగునూరు కొత్తయిండ్లు శిర్డీ సాయిబాబా జ్ఞాన మందిరంలో యాత్రకు సంబంధించి నిర్వహణపై వివిధ సంఘాల నాయకులతో చర్చించారు. సాయంత్రం 4: 30 గంటలకు నగిరి ప్యాల్స్ నుంచి స్థానిక NTR సర్కిల్ వరకు తిరంగా యాత్ర కొనసాగుతుందని చెప్పారు.