'కాంగ్రెస్ పార్టీ కేంద్ర ప్రభుత్వంపై ఆరోపణలు మానుకోవాలి'

SRPT: బీసీ రిజర్వేషన్ పేరిట కాంగ్రెస్ ప్రభుత్వం మోసం చేస్తుందని మోతె మండలం బీజేపీ అధ్యక్షుడు శంకర్ నాయక్ విమర్శించారు. కామారెడ్డి డిక్లరేషన్ వాగ్దానంలో 42% బీసీ రిజర్వేషన్‌లో 10% ముస్లింలకు కేటాయించబోతున్నారన్నారు. ఫలితంగా బీసీలకు కేవలం 32% మాత్రమే మిగులుతుందని తెలిపారు. మైనార్టీ ఓట్ల కోసమే కాంగ్రెస్ ఈ వ్యూహం వేసిందని ఆరోపించారు.