VIDEO: హనుమాన్ జయంతి వేడుకల్లో కత్తిపోట్లు
హనుమాన్ జయంతి వేడుకల్లో భాగంగా రోడ్డుపై నిర్వహించిన కత్తులు, కర్రల విన్యాసాలు ప్రాణాపాయానికి దారితీశాయి. ఈ ప్రదర్శనల సమయంలో ప్రమాదవశాత్తూ 21 ఏళ్ల యువకుడికి కత్తిపోట్లు తగిలాయి. తీవ్ర రక్తస్రావం కావడంతో సదరు యువకుడు అక్కడికక్కడే మృతి చెందాడు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. ఈ ఘటన ఎక్కడ జరిగిందో తెలీదు కానీ, వీడియో నెట్టింట వైరల్ అవుతోంది.