'జ్వరాలపై సర్వే.. ఉచిత వైద్యం'

ADB: వర్షాకాలంలో జ్వరాలు ప్రబలే అవకాశం ఉన్నందున, ప్రజలు వైద్యం కోసం ప్రభుత్వ ఆసుపత్రులకు రావాలని ఆరోగ్య పర్యవేక్షకుడు సంతోష్ సూచించారు. మంగళవారం నేరడిగొండ మండలంలోని చిన్న బుగ్గారం గ్రామంలో జ్వరాలపై సర్వే నిర్వహించి, ఉచిత వైద్య శిబిరం ఏర్పాటు చేసి రోగులకు మందులు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో ఏఎన్ఎం జ్యోతి, ఆశ కార్యకర్త స్వాతి పాల్గొన్నారు.