గోదావరిఖని నుంచి యాదగిరిగుట్టకు ప్రత్యేక బస్సు

PDPL: గోదావరిఖని బస్టాండ్ నుంచి ఈ నెల 25వ తేదీన యాదగిరిగుట్ట, స్వర్ణగిరి, కొలనుపాక ఆలయాలకు ప్రత్యేక బస్సు ఏర్పాటు చేసినట్లు ఆర్టీసీ డివిజనల్ మేనేజర్ నాగభూషణం తెలిపారు. ఉదయం 5 గంటలకు బయలుదేరే ఈ ప్రత్యేక యాత్ర ప్యాకేజీలో పెద్దలకు రూ. 1100, పిల్లలకు రూ. 800 అని పేర్కొన్నారు. టికెట్ల రిజర్వేషన్ కోసం 7013504982, 7382847596ను సంప్రదించవచ్చని సూచించారు.