ప్రైవేట్ పాఠశాలలు నిబంధనలు పాటించవలసిందే

ప్రైవేట్ పాఠశాలలు నిబంధనలు పాటించవలసిందే

SKLM: రాష్ట్ర విద్యాశాఖ ఆదేశాల మేరకు ప్రైవేట్ పాఠశాలల యాజమాన్యాలు నిబంధనలు తప్పనిసరిగా పాటించాలని ఎంఈఓ ఉప్పాడ శాంతారావు తెలిపారు. శనివారం సాయంత్రం నరసన్నపేట మండల కేంద్రంలోని స్థానిక విద్యాశాఖ కార్యాలయంలో ఆయా యాజమాన్యాలతో ఆయన సమీక్ష సమావేశం నిర్వహించారు. తప్పనిసరిగా నిరుపేదల విద్యార్థులకు 25 శాతం ఉచితంగా విద్యను అందించాలని, సెలవు దినాలలో క్లాసులు నిర్వహించరాదన్నారు.