VIDEO: పట్టపగలే అక్రమ ఇసుక దందా
BDK: మణుగూరు అనంతారం గోదావరి నుంచి అక్రమంగా కమలాపురం గ్రామం మీదగా ఇసుక ట్రాక్టర్లు ఇవాళ హల్చల్ చేస్తున్నాయి. పగలు రాత్రి తేడా లేకుండా ట్రాక్టర్లు గ్రామ మీద నుంచి వేగంగా వెళ్లడంతో ఆ ప్రాంత ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. దాదాపు 20 నుంచి 30 ట్రాక్టర్లు ప్రతిరోజు తిరుగుతున్నాయని స్థానికులు వాపోయారు. అధికారులు స్పందించి అక్రమంగా ఇసుక రవాణ చేస్తున్నావారిపై చర్యలు తీసుకోవాలన్నారు.