'విద్యార్ధుల ఆరోగ్యంపై పర్యవేక్షణ ఉండాలి'

'విద్యార్ధుల ఆరోగ్యంపై పర్యవేక్షణ ఉండాలి'

PPM: వసతి గృహ విద్యార్ధుల ఆరోగ్యాన్ని ఎప్పటికపుడు పర్యవేక్షణ చేస్తూ, మెరుగైన ఆరోగ్య సూత్రాలపై అవగాహన పెంపొందించాలని జిల్లా ఆర్.బి.ఎస్.కె అధికారి డాక్టర్ టి. జగన్ మోహనరావు స్పష్టం చేశారు. జోగింపేట, గిరిజన సంక్షేమ హాస్టల్(ఎస్ఓఈ)ను బుధవారం సాయంత్రం ఆయన ఆకస్మికంగా సందర్శించారు. ముందుగా సిక్ రిజిస్టర్ పరిశీలించి ఏ విధమైన ఆరోగ్య సమస్యలు నమోదు చేశారని పరిశీలించారు.