కాండ్లా పోర్ట్ సరికొత్త చరిత్ర

కాండ్లా పోర్ట్ సరికొత్త చరిత్ర

గుజరాత్‌లోని దీనదయాళ్ పోర్ట్ అథారిటీ(కాండ్లా) పునరుత్పాదక ఇంధన లాజిస్టిక్స్‌లో రికార్డు సృష్టించింది. ఒకే షిప్‌మెంట్‌లో 153 విండ్ టర్బైన్ బ్లేడ్లను(1,67,675 CBM) విజయవంతంగా హ్యాండిల్ చేసి చరిత్ర కెక్కింది. 'ఎంవీ కాంగ్ కీ ఫూ హువా'(MV KANG QI FU HUA) నౌకలో ఈ భారీ కార్గో తరలివచ్చింది. గ్రీన్ ఎనర్జీ ప్రాజెక్టుల నిర్వహణలో కాండ్లా తన నాయకత్వాన్ని చాటుకుంది.