'కాళేశ్వరం ఆలయ అభివృద్ధికి రూ.200 కోట్లు మంజూరు'

'కాళేశ్వరం ఆలయ అభివృద్ధికి రూ.200 కోట్లు మంజూరు'

PDPL: నాడు సరస్వతీ పుష్కరాల సందర్భంగా కాళేశ్వరం ముక్తేశ్వర ఆలయానికి వచ్చిన సీఎం రేవంత్ రెడ్డి ఆలయ అభివృద్ధికి రూ.200 కోట్లు ఇస్తామని హామీ ఇచ్చి, ఏడాది తిరగకుండా ఆ నిధులు మంజూరు చేశారని ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్ బాబు అన్నారు. నేడు ఆలయ అభివృద్ధి పనులకు సీఎం శంకుస్థాపన చేశారని తెలిపారు. ఈ సందర్భంగా సీఎంకు కృతజ్ఞతలు తెలియజేస్తున్నామని మంత్రి సంతోషం వ్యక్తం చేశారు.