ఆశాల సమస్యలను వెంటనేపరిష్కరించాలి: మాధవి

ఆశాల సమస్యలను వెంటనేపరిష్కరించాలి: మాధవి

హన్మకొండ: సుందరయ్య భవనంలో పద్మ అధ్యక్షతన ఆశా జిల్లా కమిటీ సమావేశం శనివారం ఏర్పాటు చేశారు. సమావేశంలో ఆశాల రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ కాసు మాధవి మాట్లాడుతూ.. ఆశాల సమస్యలను వెంటనే పరిష్కరించాలని, కనీస వేతనం రూ.26,000 చెల్లించాలన్నారు. సామాజిక భద్రత, నెలకు కనీసం రూ.10వేల పెన్షన్‌గా చెల్లించాలని కోరారు.