'బడుగు, బలహీన వర్గాల ఆశాజ్యోతి జోతిరావు పూలే'
NLG: బడుగు, బలహీన వర్గాల ఆశాజ్యోతి జోతిరావు పూలే అని దేవరకొండ మాజీ శాసనసభ్యులు రమావత్ రవీంద్ర కుమార్ తెలిపారు. జ్యోతిబా ఫూలే జయంతి సందర్భంగా శనివారం డిండి మండలం సింగరాజుపల్లి గ్రామంలో ఫూలే చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో నాయకులు, కార్యకర్తలు, తదితరులు పాల్గొన్నారు.