జాతరలో డాగ్ స్క్వాడ్ తనిఖీలు
MDK: అల్లాదుర్గంలో మంగళవారం జరిగే ప్రసిద్ధ బేతాళ స్వామి జాతరకు ఏర్పాట్లు పూర్తయ్యాయి. ఈ క్రమంలో సోమవారం డాగ్ స్క్వాడ్ సిబ్బందితో ఆలయ పరిసరాల్లో పోలీసులు తనిఖీలు చేపట్టారు. తెలంగాణతో పాటు మహారాష్ట్ర, కర్ణాటక నుండి వేలాదిగా తరలిరానున్న భక్తుల కోసం భారీ భద్రతను ఏర్పాటు చేశారు. రంగురంగుల అలంకరణలతో సాగే ఎడ్ల బండ్ల ఊరేగింపు జాతరలో ప్రత్యేక ఆకర్షణగా నిలవనుంది.