నేలమట్టం కానున్న మహబూబ్‌నగర్ రైల్వే స్టేషన్
MBNR: జిల్లా కేంద్రంలో 1993 సంవత్సరంలో నిర్మించిన రైల్వే స్టేషన్ త్వరలో నేలమట్టం కాబోతోంది. ఈ రైల్వే స్టేషన్‌ను 'అమృత్ భారత్' పథకంలో భాగంగా ఎంపిక చేశారు. దీంతో ఈ రైల్వే స్టేషన్‌ను నూతనంగా నిర్మించనున్నారు. ఈ సందర్భంగా స్టేషన్‌ను కూల్చేసి ప్రయాణికులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా దగ్గర్లోనే టికెట్ బుకింగ్, విచారణ ఇలాంటివి అన్ని ఏర్పాటు చేయనున్నారు.