తెలంగాణ సచివాలయంలో జిల్లా కలెక్టర్ల సమావేశం
HYD: తెలంగాణ సచివాలయంలో ఇవాళ అన్ని జిల్లాల కలెక్టర్లతో కీలక సమావేశం జరుగుతోంది. ఈ సదస్సులో సీఎం రేవంత్‌రెడ్డి పాల్గొని 'ప్రజాపాలన-ప్రగతి ప్రణాళిక'పై కలెక్టర్లకు దిశానిర్దేశం చేయనున్నారు. సాయంత్రం 6 గంటల వరకు సాగే ఈ సమావేశంలో ప్రభుత్వ లక్ష్యాల అమలు, క్షేత్రస్థాయిలో పాలనను వేగవంతం చేయడంపై కీలక నిర్ణయాలు తీసుకోనున్నారు.