కేయూలో పార్ట్‌టైమ్ లెక్చరర్ల నియామకం
WGL: కాకతీయ యూనివర్సిటీలో పార్ట్‌టైమ్ లెక్చరర్ల నియామకానికి ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. రెండు వారాల్లో నోటిఫికేషన్ జారీ చేయనున్నారు. రెగ్యులర్ అధ్యాపకుల కొరతతో ఆర్ట్స్, సైన్స్, సోషల్ సైన్స్, కామర్స్, లా, ఇంజనీరింగ్, ఫార్మసీ విభాగాల్లో మొత్తం 130 పోస్టుల భర్తీకి ఆమోదం లభించింది. కమిటీ నివేదిక ఆధారంగా త్వరలోనే నియామక ప్రక్రియ ప్రారంభించనుంది.