పాఠశాలపై దాడి.. 227 మంది విద్యార్థుల అపహరణ!
ఆఫ్రికా దేశం నైజీరియాలో దారుణం జరిగింది. అగ్వారా ప్రాంతంలోని సెయింట్ మేరీస్ పాఠశాలలపై కొంతమంది దుండుగులు దాడి చేసి 227 మందిని కిడ్నాప్ చేశారు. వీరిలో 215 మంది విద్యార్థులు, 12 మంది టీచర్లు ఉన్నారు. అపహరణకు గురైన వారిని ఎక్కడుకు తీసుకెళ్లారనే దానిపై విచారిస్తున్నట్లు అధికారులు చెప్పారు. త్వరలోనే వారిని విడిపించే ప్రయత్నం చేస్తామని తెలిపారు.