హన్వాడలో ఘనంగా సదర్ ఉత్సవాలు
మహబూబ్‌నగర్ జిల్లా హన్వాడ మండలం కేంద్రంలో ఆదివారం సాయంత్రం సదర్ ఉత్సవాలు ఘనంగా జరిగాయి. ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరై, శ్రీకృష్ణ భగవానుని విగ్రహానికి పూజలు చేశారు. తెలంగాణలో సదర్ ఉత్సవాలు గొప్ప చారిత్రక సాంస్కృతిక సంప్రదాయాన్ని ప్రతిబింబిస్తాయని, ప్రజల ఐక్యతకు చిహ్నమని ఆయన అన్నారు. దున్నపోతుల ప్రదర్శనను వీక్షించి అభినందించారు.