రీఎంట్రీలో దుమ్మురేపిన పాండ్యా

రీఎంట్రీలో దుమ్మురేపిన పాండ్యా

స్టార్ క్రికెటర్ హార్దిక్ పాండ్యా SMATలో బరోడా తరఫున బరిలోకి దిగాడు. గాయం నుంచి కోలుకున్న తర్వాత తొలిసారి పాండ్యా ఇవాళ మైదానంలో అడుగుపెట్టాడు. పంజాబ్‌తో జరిగిన ఈ మ్యాచ్‌లో అతడు 42 బంతుల్లో 7 ఫోర్లు, 4 సిక్సర్లతో 77* రన్స్ చేసి బరోడాకు విజయాన్ని అందించాడు. అలాగే, బౌలింగ్‌లో ఓ వికెట్ పడగొట్టాడు. దీంతో SAతో T20 సిరీస్‌లో పాండ్యా ఆడటం ఖాయంగా కనిపిస్తోంది.