త్వరలో పట్టాల పైకి మరో 4 వందేభారత్ రైళ్లు

త్వరలో పట్టాల పైకి మరో 4 వందేభారత్ రైళ్లు

ప్రయాణికుల నుంచి వందేభారత్ రైళ్లకు డిమాండ్ పెరుగుతున్న నేపథ్యంలో మరో నాలుగు వందేభారత్ రైళ్లను రైల్వే శాఖ అందుబాటులోకి తీసుకురానుంది. ఈ రైళ్లు కర్ణాటక, కేరళ, పంజాబ్, MP, UP, ఢిల్లీ కేంద్రంగా రాకపోకలు సాగించనున్నాయి. ట్రయల్ రన్ తర్వాత ప్రయాణికులకు ఇవి అందుబాటులోకి వస్తాయని రైల్వే అధికారులు తెలిపారు. వీటితో కలిపి మొత్తం వందేభారత్ రైళ్ల సంఖ్య 164కి చేరింది.