యూరియా అందించడంలో ప్రభుత్వం విఫలం: మాజీ ఎమ్మెల్యే

యూరియా అందించడంలో ప్రభుత్వం విఫలం: మాజీ ఎమ్మెల్యే

NLG: రైతులకు యూరియాను అందించడంలో ప్రభుత్వం విఫలమైందని మాజీ ఎమ్మెల్యే నోముల భగత్ అన్నారు. మంగళవారం అనుముల మండలం కొత్తపల్లి సహకార సంఘం వద్ద యూరియా కోసం బారులు తీరిన రైతుల కష్టాలను అడిగి సమస్యను అధికారుల దృష్టికి తీసుకెళ్లారు. కేంద్రం నుంచి రాష్ట్రానికి రావాల్సిన యూరియాను తీసుకొచ్చేందుకు ప్రభుత్వం ఒత్తిడి తేవాలన్నారు.