లంచం తీసుకుంటూ.. ఏసీబీకి చిక్కిన ఏఈ

మేడ్చల్: కుత్బుల్లాపూర్ నియోజకవర్గం ప్రగతి నగర్ ఎలక్ట్రిసిటీ డిపార్ట్‌మెంట్ ఏఈగా విధులు నిర్వహిస్తున్న జ్ఞానేశ్వర్ లంచం తీసుకుంటూ ఏసీబీకి పట్టుపడ్డాడు. ఈ సందర్భంగా విద్యుత్ స్తంభాన్ని మార్చడానికి సుమారు రూ.50వేలను డిమాండ్ చేయగా ఏసీబీ అధికారులకు బుధవారం సాయంత్రం చిక్కాడు. కాంట్రాక్టర్ ప్రవీణ్ ఫిర్యాదుతో ఏసీబీ అధికారులు ఆయనను పట్టుకున్నారు.