'జనగణన ప్రతి ఒక్కరి బాధ్యత'
ELR: నూజివీడు మండలం అన్నవరం జడ్పీ హైస్కూల్‌లో స్వీయ జన గణనపై విద్యార్థులకు బుధవారం అవగాహన కల్పించారు. పాఠశాల హెచ్ఎం విజయకుమారి మాట్లాడుతూ.. జనగణన కార్యక్రమాన్ని ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకున్నట్లు తెలిపారు. జన గణన ఆవశ్యకతపై తల్లిదండ్రులకు విద్యార్థులే వివరించాలన్నారు. ప్రతి ఒక్కరి బాధ్యతగా గుర్తించాలని సూచించారు.