VIDEO: అనాథ వృద్ధుడి అంతిమ సంస్కారాలు
అన్నమయ్య: మదనపల్లి ఆసుపత్రిలో చికిత్స పొందుతూ అనంతపురంకు చెందిన అనాథ వృద్ధుడు శేషు నాలుగు రోజుల క్రితం మృతిచెందాడు. బంధువులు ఎవరూ రాకపోవడంతో, హెల్పింగ్ మైండ్స్ బృందం ముందుకు వచ్చి శుక్రవారం హిందూ సాంప్రదాయం ప్రకారం స్థానిక హిందు స్మశాన వాటికలో అంత్యక్రియలు నిర్వహించింది. ఈ మానవత్వ సేవా కార్యక్రమంలో అబూబకర్ సిద్దిక్ బృందం కూడా పాల్గొంది.