అన్నదమ్ముల మధ్య ఆస్తి గొడవ.. ఇద్దరికి తీవ్ర గాయాలు
VZM: బొండపల్లి మండలం కొండకిండం గ్రామంలో ఆస్తి తగాదాపై ముగ్గురు అన్నదమ్ములు మధ్య సోమవారం ఘర్షణ జరిగిందని ఎస్ఐ మహేష్ సోమవారం తెలిపారు. కలిశెట్టి గౌరినాయుడు కత్తితో దాడి చేయడంతో కలి శెట్టి సత్యనారాయణ, కలిశెట్టి బంగారు నాయుడులు గాయపడటంతో వారిని చికిత్స కోసం జిల్లా కేంద్ర ఆస్పత్రికి తరలించామన్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని చెప్పారు.