శాశ్వత బస్సు స్టేజీని ఏర్పాటు చేయాలని వినతి
MHBD: తొర్రూరు మండలంలోని నాంచారి మడూరులో శాశ్వత ఆర్టీసీ బస్సు స్టేజీని ఏర్పాటు చేయాలని కోరుతూ.. సర్పంచ్ బంగారు రమేష్ ఆధ్వర్యంలో ఆర్టీసీ ఎండీ నాగిరెడ్డి, ట్రాఫిక్ ఇన్స్‌స్పెక్టర్ శ్రీదేవిలకు వినతి పత్రం అందజేశారు. ఈ విషయంపై తక్షణమే స్పందించిన అధికారులు తగిన ఏర్పాట్లు చేయాలని తొర్రూరు ఆర్టీసీ డిఎంకు ఆదేశాలు జారీ చేశారు.