VIDEO: 'రైతులకు ఉపాధి అవకాశాలు మెరుగ్గా ఉన్నాయి'
కోనసీమ: కొత్తపేట నియోజకవర్గంలో ఇటు రైతులకు, అటు నిరుద్యోగ యువతకు ఉపాధి కల్పించే దిశగా చర్యలు చేపట్టినట్లు ఎమ్మెల్యే బండారు సత్యానందరావు పేర్కొన్నారు. ఈ మేరకు మంగళవారం ఆయన రావులపాలెంలో మాట్లాడుతూ.. దేవరపల్లిలో రూ.12 కోట్లతో MSME పార్క్ ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. కోనసీమ జిల్లాలో అరటి రైతులకు ఉపాధి అవకాశాలు మెరుగ్గా ఉన్నాయని తెలిపారు.