తెలంగాణ పబ్లిక్ స్కూల్స్ నిర్మాణాలపై కలెక్టర్ సమీక్ష!

తెలంగాణ పబ్లిక్ స్కూల్స్ నిర్మాణాలపై కలెక్టర్ సమీక్ష!

ఖమ్మం కలెక్టరేట్‌లో అదనపు కలెక్టర్ పి. శ్రీజ, సబ్ కలెక్టర్ అజయ్ యాదవ్‌లతో కలిసి తెలంగాణ పబ్లిక్ స్కూల్స్ నిర్మాణాలపై జిల్లా కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి సమీక్ష నిర్వహించారు. 800 నుంచి 1000 మంది విద్యార్థులకు సరిపడా జి+1 పద్ధతిలో అదనపు తరగతి గదులు, ల్యాబ్స్, ఆటస్థలం వంటి వసతులతో కూడిన అత్యాధునిక డిజైన్లను సిద్ధం చేయాలని ఆదేశించారు.