VIDEO: 'తక్షణమే రోడ్డు మరమ్మత్తులు చేపట్టాలి'

VIDEO: 'తక్షణమే రోడ్డు మరమ్మత్తులు చేపట్టాలి'

SKLM: ఆమదాలవలసలోని పూజారి పేట నుంచి బొడ్డేపల్లిపేట వెళ్లే రహదారి గుంతలతో అధ్వానంగా మారింది. దీంతో నిన్న పడిన చిన్న వర్షానికే గుంతలలోకి నీరు చేరడంతో ద్విచక్ర వాహనదారులు తీవ్ర ఇబ్బంది ఎదుర్కొంటున్నారు. రాత్రి సమయంలో గుంతలు కనబడక వాహనదారులు ప్రమాదాలకు గురయ్యే అవకాశం ఉందని స్థానికులు తెలిపారు. అధికారులు తక్షణమే రోడ్డు మరమ్మతులు చేపట్టాలన్నారు.