యూరియా కోసం బారులు తీరిన రైతులు

యూరియా కోసం బారులు తీరిన రైతులు

SRCL: చందుర్తి మండలం ఎనగల్ గ్రామంలో రైతులు యూరియా బస్తాల కోసం బారులు తీరారు. యూరియా కోసం గంటల తరబడి రైతులు నిరీక్షించారు. ఎనగల్ గ్రామంలో ఐకెపీ ఆధ్వర్యంలో గ్రామానికి 450 యూరియా బస్తాలు సరఫరా కాగా, 240 మంది రైతులకు రెండు బస్తాల చొప్పున యూరియా పంపిణీ చేశారు. ఉదయం10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు క్యూలైన్లో బారులు తీరారు.