సాంకేతిక సమస్య.. 800 విమానాలు ఆలస్యం
ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్(ATC)లో సాంకేతిక సమస్య తలెత్తడంతో ఢిల్లీలోని ఇందిరాగాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో 800 విమానాల రాకపోకలు ఆలస్యమయ్యాయి. దీంతో వందలాది ప్రయాణికులు ఎయిర్‌పోర్టులోనే చిక్కుకుపోయారు. ఈ సమస్యను పరిష్కరించేందుకు సంబంధిత వర్గాలు కృషి చేస్తున్నారని ఎయిర్‌పోర్టు అథారిటీ ఆఫ్ ఇండియా తెలిపింది. ఈ అసౌకర్యానికి చింతిస్తున్నామని పేర్కొంది.