రేపటి నుంచి మూడో విడత నామినేషన్లు
SRD: జిల్లాలోని 17 మండలాల్లో ఈనెల 3 నుంచి 5వ తేదీ వరకు మూడో విడత నామినేషన్ల స్వీకరణ కార్యక్రమం ప్రారంభమవుతుందని కలెక్టర్ ప్రావీణ్య మంగళవారం తెలిపారు. నామినేషన్ల స్వీకరణ కోసం అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు చెప్పారు. 234 గ్రామపంచాయతీలు,1960 వార్డు స్థానాలకు నామినేషన్లు స్వీకరిస్తారని తెలిపారు.