దేశ ఐక్యతకు రన్ ఫర్ యూనిటీ దోహదం: కలెక్టర్

దేశ ఐక్యతకు రన్ ఫర్ యూనిటీ దోహదం: కలెక్టర్

GDWL: దేశ, ఐక్యతను కాపాడేందుకు 'రన్ ఫర్ యూనిటీ' కార్యక్రమం దోహదపడుతుందని గద్వాల కలెక్టర్ సంతోష్ అన్నారు. శుక్రవారం పోలీస్ శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన రన్ ఫర్ యూనిటీలో ఆయన మాట్లాడారు. దేశంలో భిన్న మతాలు, జాతులు, సంప్రదాయాలు వేరుగా ఉన్నప్పటికీ, ఆచార వ్యవహారాలను గౌరవిస్తూ అన్ని వర్గాల ప్రజలు ఐక్యమత్యంగా జీవిస్తున్నారని కలెక్టర్ పేర్కొన్నారు.