డ్రగ్స్ నిర్మూలనకై సైకిల్ యాత్ర
KKD: దండి మార్చ్ 2.O కార్యక్రమంలో భాగంగా తిరుపతి నుండి విశాఖపట్నం వరకు 1000కి.మీ. సైకిల్ యాత్ర పెద్దాపురం ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్‌కు చేరుకుంది. ఈ సందర్భంగా ఎమ్మెల్యే నిమ్మకాయల చినరాజప్ప మాట్లాడుతూ యువత డ్రగ్స్ నిర్మూలనకు కంకణం కట్టుకోవాలని, మాదక ద్రవ్యాల రహిత రాష్ట్రం కోసం సీఎం చంద్రబాబు నాయుడు కృషి చేస్తున్నారని పేర్కొన్నారు.