జెండా ఎగురవేసిన ఎమ్మెల్యే వరదరాజుల రెడ్డి

KDP: ప్రొద్దుటూరులోని స్థానిక నెహ్రూ రోడ్డులో గల టీడీపీ కార్యాలయంలో శుక్రవారం స్వాతంత్ర దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఎమ్మెల్యే నంద్యాల వరదరాజుల రెడ్డి జాతీయ జెండాను ఎగురవేసి జెండా వందనం చేశారు. అనంతరం గాంధీ రోడ్డులో గల గాంధీ విగ్రహానికి పూలమాల వేసి ఘన నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో TDP నాయకులు పాల్గొన్నారు.