అమెరికాపై రష్యా సంచలన ఆరోపణలు

అమెరికాపై రష్యా సంచలన ఆరోపణలు

నార్డ్ స్ట్రీమ్‌ పైప్‌లైన్‌ను అమెరికా స్వాధీనం చేసుకోవాలనుకుంటోందని రష్యా విదేశాంగ మంత్రి సెర్గీ లవ్రోవ్‌ సంచలన వ్యాఖ్యలు చేశారు. యూరప్‌కు తమ సొంత గ్యాస్‌ను అధిక ధరలకు విక్రయించడానికి రష్యా-జర్మనీల మధ్య ఉన్న ఈ మార్గాన్ని తమ ఆధీనంలోకి తెచ్చుకోవాలని చూస్తోందని చెప్పారు. తద్వారా యూరప్ ఆర్థిక వ్యవస్థను అమెరికాపై ఆధారపడేలా చేయటమే వారి వ్యూహమన్నారు.