రామతీర్థం గురించి మీకు తెలుసా..!

VZM: జిల్లాలో రామతీర్థం ప్రసిద్ధ పుణ్యక్షేత్రం. ఇది విజయనగరానికి సుమారు 12 కి.మీ దూరంలో ఉంది. రామతీర్థం కొండలపై పురాతన రామాలయం, కోటేశ్వర స్వామి ఆలయం, బౌద్ధ గుహలు ఉన్నాయి. పాండవుల గుహలు, రామగిరి వంటి ప్రదేశాలు ఇక్కడి ప్రత్యేక ఆకర్షణలు. ఈ ప్రదేశం భక్తులకు, పర్యాటకులకు ఆహ్లాదాన్ని కలిగిస్తాయి. ప్రతి సంవత్సరం రామ నవమి సందర్భంగా ఇక్కడ భారీగా జాతర నిర్వహిస్తారు.