'ప్రభుత్వం స్పందించకపోతే నిరసన చేపడతాం'

కోనసీమ: వరుస సర్వే పనులతో విసిగిపోయామని గ్రామ, వార్డు సచివాలయాల ఉద్యోగుల ఐక్యవేదిక సభ్యులు ఆవేదన వ్యక్తం చేశారు. సమయపాలన లేని వీడియో కాన్ఫరెన్స్‌ల నుంచి విముక్తి కలిగించాలని, నోషనల్ ఇంక్రిమెంట్ మంజూరు చేయాలని, సచివాలయ ఉద్యోగులను జూనియర్ అసిస్టెంట్ కేడర్‌కు మార్చాలన్నారు. అనంతరం పలు డిమాండ్లతో కూడిన వినతి పత్రాన్ని ఆలమూరు ఎంపీడీవో రాజుకు అందజేశారు.